
`చెక్` ఆశించిన ఫలితాన్ని అందివ్వకపోడంతో కొంత నిరాశకు గురయ్యారు హీరో నితిన్. చంద్రశేఖర్ ఏలేటి వంటి దర్శకుడితో చేసిన సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టకపోవడంతో ఆలోచనలో పడిన నితిన్‌కు తాజాగా విడుదలైన రొమాంటిక్ లవ్ స్టోరీ `రంగ్ దే` సూపర్ హిట్‌ని అందించింది. దీంతో ఈ బర్త్‌డేని ఫుల్ జోష్‌తో జరుపుకుంటున్నారు. అదే కాకుండా ఇదే రోజు తను నటిస్తున్న `అంధాదున్` రీమేక్ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.
బాలీవుడ్ హిట్ చిత్రం `అంధాదున్` ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి `మాస్ట్రో` అనే టైటిల్‌ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్నా కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో నితిన్‌కి జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తోంది. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని నితిన్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన మేకర్స్ ఇదే రోజు మరో సర్‌ప్రైజ్‌ని ప్లాన్ చేశారు.
ఈ రోజు సాయంత్రం 4:05 నిమిషాలకు ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసి వెల్లడించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూన్ 11న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. నితిన్ తొలిసారి అంధుడి పాత్రలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి.