Homeటాప్ స్టోరీస్రేపే విడుదల కానున్న వరుడు కావలెను టీజర్

రేపే విడుదల కానున్న వరుడు కావలెను టీజర్

రేపే విడుదల కానున్న వరుడు కావలెను టీజర్
రేపే విడుదల కానున్న వరుడు కావలెను టీజర్

యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం మల్టిపుల్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. వాటిలో శౌర్య చేస్తోన్న రొమాంటిక్ డ్రామా వరుడు కావలెను. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ ఈ చిత్రం రూపొందుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా టీజర్ విడుదల తేదీ గురించి టీమ్ క్లారిటీ ఇచ్చింది. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ పుట్టినరోజు సందర్భంగా రేపు అంటే ఆగస్ట్ 31న వరుడు కావలెను టీజర్ విడుదలవుతోంది.

- Advertisement -

ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన దిగు దిగు దిగు నాగ సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ అప్పుడే 10 మిలియన్ వ్యూస్ ను దాటి దూసుకుపోతోంది. త్వరలోనే వరుడు కావలెను రిలీజ్ కు సంబంధించి అప్డేట్ ను ఇవ్వనున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All