Homeటాప్ స్టోరీస్సెప్టెంబర్ 10కే ఫిక్స్ అయిపోయిన న్యాచురల్ స్టార్

సెప్టెంబర్ 10కే ఫిక్స్ అయిపోయిన న్యాచురల్ స్టార్

సెప్టెంబర్ 10కే ఫిక్స్ అయిపోయిన న్యాచురల్ స్టార్
సెప్టెంబర్ 10కే ఫిక్స్ అయిపోయిన న్యాచురల్ స్టార్

న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ చుట్టూ బోలెడంత డ్రామా నడిచిన విషయం తెల్సిందే. ముందుగా ఈ సినిమాను ఓటిటికి ఇచ్చేయడంపై, ఆ తర్వాత వినాయక చవితికి సెప్టెంబర్ 10కే విడుదల చేయడంపై ఎగ్జిబిటర్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. అయితే సినిమా మాత్రం ముందు నుండీ అనుకున్న తేదీకే వస్తోంది. సెప్టెంబర్ 10న ఈ చిత్రం విడుదలవుతుందని అధికారికంగా తెలియజేసింది అమెజాన్ ప్రైమ్.

ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేసాడు. షైన్ స్క్రీన్ సినిమాస్ నిర్మించగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు. జగపతి బాబు హీరో అన్న పాత్రలో కనిపిస్తాడు. అన్నదమ్ముల మధ్య అనుబంధం ఈ చిత్రంలో స్పెషల్ హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది.

- Advertisement -

మరి సెప్టెంబర్ 10కే ఈ చిత్రం వస్తుండడంతో లవ్ స్టోరీ రిలీజ్ లో ఏమైనా మార్పులుంటాయేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All