Homeన్యూస్ఈ దీపావళికి ట్రైయాంగిల్ వార్ కు టాలీవుడ్ రెడీ!

ఈ దీపావళికి ట్రైయాంగిల్ వార్ కు టాలీవుడ్ రెడీ!

ఈ దీపావళికి ట్రైయాంగిల్ వార్ కు టాలీవుడ్ రెడీ!
ఈ దీపావళికి ట్రైయాంగిల్ వార్ కు టాలీవుడ్ రెడీ!

ఈ దీపావళి సీజన్ కు మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అందులో ఒకటి స్ట్రైట్ తెలుగు సినిమా కాగా, మిగతా రెండూ కూడా డబ్బింగ్ చిత్రాలు. సంతోష్ శోభన్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా సక్సెస్ఫుల్ దర్శకుడు మారుతి తెరకెక్కించిన మంచి రోజులు వచ్చాయ్ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సినిమా ప్రోమోలు ఆసక్తికరంగా అనిపించాయి. లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై టీమ్ మొత్తం కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం వస్తోంది. రజినీకాంత్ అన్నాత్తే చిత్రాన్ని దీపావళికి విడుదల చేస్తున్నారన్న విషయం తెల్సిందే. ఈ సినిమా తెలుగులో పెద్దన్నగా విడుదలవుతోంది. సాధారణంగా రజినీకాంత్ సినిమాలకు ఉండే క్రేజ్ ఎందుకో ఈసారి కొంచెం తగ్గింది. తెలుగులో ముఖ్యంగా రీసెంట్ రజినీ సినిమాలు ప్లాప్ అవ్వడంతో మార్కెట్ కూడా కొంత డల్ అయింది. అయితే రజినీకాంత్ నుండి మాస్ చిత్రం రానుండడం, దర్శకుడు శివ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా పెద్దన్నను తక్కువ అంచనా వేయలేం.

- Advertisement -

అలాగే విశాల్, ఆర్య కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ ఎనిమి. అటు విశాల్, ఇటు ఆర్య ఇద్దరూ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ సినిమాకు కూడా డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది. మరి ఈ మూడు చిత్రాల్లో ఏది పైచేయి సాధిస్తుంది అన్నది చూద్దాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All