Homeన్యూస్ఏంటి విశాల్ మూవీకి థియేటర్స్ దొరకట్లేదా?

ఏంటి విశాల్ మూవీకి థియేటర్స్ దొరకట్లేదా?

ఏంటి విశాల్ మూవీకి థియేటర్స్ దొరకట్లేదా?
ఏంటి విశాల్ మూవీకి థియేటర్స్ దొరకట్లేదా?

తమిళనాడులో స్టార్ హీరోల్లో విశాల్ ముందువరసలో ఉంటాడు. భిన్నమైన కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే విశాల్ అక్కడ స్టార్ స్టామినాను అందుకున్నాడు. విశాల్ సినిమాలు అంటే ఉండే ఆసక్తి వేరు. అలాంటిది ఇప్పుడు విశాల్ సినిమా విడుదలవుతోందంటే థియేటర్లు దొరకట్లేదని విమర్శ ఎదురవుతోంది.

తమిళులకు దీపావళి అంటే పెద్ద పండగ. అక్కడ సందడి వేరే రేంజ్ లో ఉంటుంది. ఈసారి పండగకు రెండు భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన అన్నాత్తే. రజినీకాంత్ సినిమా అంటే ఇక బజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

- Advertisement -

సన్ పిక్చర్స్ అన్నాత్తే చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం తమిళనాడులో వారి ప్రభుత్వమే  ఉంది కాబట్టి మొత్తం అన్ని థియేటర్లలో అన్నాత్తే చిత్రాన్ని ఆడించాలని అనధికారికంగా ఆదేశాలు జారీ చేశారట. మొత్తం 900 థియేటర్లలో దీపావళి రోజున అన్నాత్తే ప్రదర్శితమవ్వాలని అంటున్నారని కొంత మంది ఆరోపిస్తున్నారు.

మరోవైపు విశాల్ – ఆర్య కలిసి నటించిన ఎనిమి చిత్రం కూడా దీపావళికే విడుదలకు షెడ్యూల్ చేసుకుంది. సోషల్ మీడియాలో ఒక ఆడియో వైరల్ అవుతోంది. ఎనిమి నిర్మాతది అని చెబుతోన్న ఆ ఆడియోలో తమ చిత్రానికి కనీసం 250 థియేటర్లయినా కేటాయించాలని నిర్మాత కోరుతున్నాడు. మరి ఇదే కనుక నిజమైతే విశాల్ సినిమాకే ఈ రేంజ్ కష్టాలు అంటే ఎలా? అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All