Homeటాప్ స్టోరీస్ఇర్ఫాన్ మృతి అత్యంత బాధాక‌రం!

ఇర్ఫాన్ మృతి అత్యంత బాధాక‌రం!

ఇర్ఫాన్ మృతి అత్యంత బాధాక‌రం!
ఇర్ఫాన్ మృతి అత్యంత బాధాక‌రం!

బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్‌ఖాన్ తీవ్ర అనారోగ్యంతో బుధ‌వారం ఉద‌యం మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ వార్త విని చాలా మంది సినీ న‌టులు తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు. దేశ వ్యాప్తంగా వున్న ఇర్ఫ‌న్ అభిమానులు ఈ వార్త విని షాకయ్యారు. తెలుగులో ఇర్ఫాన్ న‌టించింది ఒక్క చిత్ర‌మే అయినా టాలీవుడ్ న‌టుల‌కు ఆయ‌న సుప‌రిచితుడు కావ‌డంతో ఆయన ఆక‌స్మిక మృతి ప‌ట్ల టాలీవుడ్ స్టార్స్ స్పందించారు.

ఇర్ఫాన్‌ఖాన్ మ‌ర‌ణించార‌నే ఘోర‌మైన వార్త‌విని బాధ‌పడ్డా. ఆయ‌న అద్భుత‌మైన న‌టుడు కాబ‌ట్టే ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఇర్ఫాన్ స్థానం భ‌ర్తీ చేయ‌లేనిది. అత‌ని న‌ట‌న మ‌న హృద‌యాల్లో ఎప్ప‌టికీ నిల‌చిపోతుంది. అన్నారు చిరంజీవి. ఇర్ఫాన్ మ‌ర‌ణం ప్ర‌పంచ సినిమాకు తీర‌ని లొటు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం నాకు ద‌క్క‌లేదు. ఆయ‌న సినిమాలు చూశా. అద్భుత‌మైన న‌టుడు. ఇర్ఫాన్ ఆత్మ‌కు శాంతి చేకూరాలి అని విక్ట‌రీ వెంక‌టేష్ స్పందించారు.

- Advertisement -

న‌మ్మ‌లేని గుండె బ‌ద్ద‌ల‌య్యే వార్త ఇది. ఇర్ఫాన్‌ఖాన్‌ల మ‌రొక న‌టుడిని మ‌నం చూడ‌లేం. మీరు ఒక ర‌త్నం స‌ర్‌. రెస్ట్ ఇన్ పీస్‌` అని డా. రాజ‌శేఖ‌ర్ పేర్కొన్నారు. ఇర్ఫాన్‌ఖాన్ ఆకస్మిక మ‌ర‌ణ వార్త న‌న్ను ఎంత‌గానో బాధించింది. ఆయ‌న లేని లోటు భ‌ర్తీ చేయ‌లేనిది` అని మ‌హేష్‌, ప్ర‌పంచ సినిమా ఒక ఆభ‌ర‌ణం లాంటి న‌టుడిని కోల్పోయింది` అని రామ్‌చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు. ఇర్ఫాన్‌ఖాన్ మ‌ర‌ణం అత్యంత భాధాక‌రం. ఆ.. చాలా ముందుగానే వెళ్లిపోయావ్ ఇర్ఫాన్‌. ప్ర‌పంచ క‌ళ‌కు నీవు చేసిన కృషికి ధ‌న్య‌వాదాలు. మేము నిన్ను కోల్పోయాం` అని విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ట్వీట్ చేశారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All