Homeటాప్ స్టోరీస్‌బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్‌ఖాన్ మృతి!

‌బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్‌ఖాన్ మృతి!

‌బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్‌ఖాన్ మృతి!
‌బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్‌ఖాన్ మృతి!

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు ఇర్ఫాన్‌ఖాన్ (53) బుధ‌వారం క‌న్నుమూశారు. బాలీవుడ్ తెర‌పై విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఆయ‌న అనారోగ్యం కార‌ణంగా మృతి చెందారు. ఇటీవ‌ల కొల‌న్ ఇన్ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆరోగ్యం క్షిణించ‌డంతో కుటుంబ స‌భ్యులు ముంబైలోరి కోకిలా బెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చేర్పించారు.

ఇర్ఫాన్ ఆరోగ్యం క్షీణించ‌డంతో వైద్యులు ఆయ‌న‌ని ఐసీయుకి త‌ర‌లించి వైద్యం అందించారు. అయితే అప్ప‌టికే ప‌రిస్థితి విష‌మించ‌డంతో చికిత్స పొందుతూనే బుధ‌వారం తుది శ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ఇర్ఫాన్ కుటుంబ స‌భ్యులు మీడియాకు వెల్ల‌డించారు. హిందీ చిత్రాల్లో విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న ఇర్ఫాన్ ప‌లు హాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టించి అంత‌ర్జాతీయ గుర్తింపుని ద‌క్కించుకున్నారు.

- Advertisement -

2018లో ఆయ‌న‌ న్యూరో ఎండో క్రైమ్ ట్యూమ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్టు వైద్యులు ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి ఇర్ఫాన్ సినిమాలు కొంత దూరంగానే వుంటున్నారు. లండ‌న్ వెళ్లి చికిత్స చేయించుకున్న ఆయ‌న మ‌రోసారి చికిత్స కోసం లండ‌న్ వెళ్లాల్సి వుంది. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా అది సాధ్య‌ప‌డ‌లేదు.  ఇటీవ‌ల జైపూర్‌లో వున్న ఇర్ఫాన్ త‌ల్లి స‌యీదా బేగం మృతి చెందారు. లాక్‌డౌన్ కార‌ణంగా త‌ల్లి అంత్ర క్రియల‌కు వెళ్ల‌లేక‌పోయారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All