
`సైరా నరసింహారెడ్డి` వంటి సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి గేర్ మార్చారు. వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటా శివ దర్శకత్వంలో రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటి వరకే దాదాపుగా యాభై శాతం పూర్తయినట్టు తెలిసింది.
చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రానికి `ఆచార్య` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. సినిమాలో చిరు పేరు గోవిందాచార్య. దాని స్రకారమే సినిమాకు `ఆచార్య` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఇందులోకి కీలక అతిథి పాత్రలో రామ్‌చరణ్ నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాత ఈ చిత్ర కీలక షెడ్యూల్‌ని ప్రారంభిస్తారట.
ఇదిలా వుంటే మలయాళంలో మోహన్‌లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన `లూసీఫర్` రీమేక్ హక్కుల్ని కొణిదెల ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరు నటించబోతున్నారు. సుజీత్ దర్శకత్వం వహించే అవకాశం వుంది. దీనితో పాటు యువ దర్శకుడు బాబీ చెప్పిన లైన్ నచ్చి అతనితో కూడా సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.