Homeటాప్ స్టోరీస్థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రానికి డిజాస్టర్ టాక్

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రానికి డిజాస్టర్ టాక్

Thugs of hindostan movie reviewఅమీర్ ఖాన్ , అమితాబ్ బచ్చన్ , కత్రినా కైఫ్ నటించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది . ఈ సినిమాని చూసిన నెటిజన్లు థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ పరమ బోరింగ్ చిత్రమంటూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు జనాలు . ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రం . కల్పిత కథతో పిరియాడిక్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఎందుకంటే అమితాబ్ బచ్చన్ , అమీర్ ఖాన్ , కత్రినా కైఫ్ లు నటించిన చిత్రం కావడం ఒక కారణమైతే ధూమ్ సిరీస్ చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం మరో కారణం .

ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా ఎక్కడా మెప్పించలేక పోయాడు దర్శకుడు . కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ , కత్రినా అందాలు చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు తప్పితే మిగతా అన్నిచోట్లా ఘోరంగా విఫలమయ్యాడు . ఇక సినిమా ఆసాంతం సీరియల్ కన్నా దారుణంగా సాగతీతలా మారడంతో ప్రేక్షకులు విసిగి వేసారి పోతున్నారు . ఇక బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ కూడా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ పట్ల పెదవి విరిచాడు . నెటిజన్లు అయితే ఈ సినిమాని ఓ ఆట ఆడుకుంటున్నారు . మొత్తానికి భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి యునానిమస్ గా డిజాస్టర్ టాక్ వచ్చింది .

- Advertisement -

English Title: Thugs of hindostan movie review

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All