Homeటాప్ స్టోరీస్విడాకులు ఇవ్వడానికి కారణం అదేనట !

విడాకులు ఇవ్వడానికి కారణం అదేనట !

Aamir khan comments on divorce with reena duttaబాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మొదటి భార్యకు ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందో ఇన్నాళ్లకు వివరించి చెబుతున్నాడు . ఇన్నాళ్ళుగా చెప్పని రహస్యాన్ని ఎందుకు చెబుతున్నాడంటే ఆమెకు విడాకులు ఇచ్చినప్పటికీ చాలాకాలంగా ఆమెతో ఫ్రెండ్ గానే జీవితాన్ని కొనసాగిస్తున్నాడు దాంతో ఈ విషయం గురించి నోరు విప్పాడు . రీనా దత్తా ని 1986 లో వివాహం చేసుకున్నాడు అమీర్ ఖాన్ అయితే ఆరేళ్ళ కాపురం తర్వాత విడాకులు ఇచ్చాడు . తరచుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో ఇక కలిసి ఉండటంలో అర్ధం లేదని ఇద్దరు కూడా విడిపోవాలని అనుకున్నారట ! అయితే పెద్దవాళ్ళు మాత్రం విడాకులకు ఒప్పుకోలేదు దాంతో 2002 లో వాళ్లతో విభేదించి మరీ విడాకులు తీసుకున్నారు . కట్ చేస్తే 2005 లో కిరణ్ రావు ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అమీర్ ఖాన్ .

రీనా దత్తా తో విడాకులు తీసుకున్నప్పటికీ ఆమెతో ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తూనే ఉన్నాడట ! ఈ విషయాన్నీ అమీర్ ఖాన్ స్వయంగా వెల్లడించడం విశేషం . మేమిద్దరం విడాకులు తీసుకున్నప్పటికీ స్నేహితులుగా ఒకరి అభిప్రాయాలూ మరొకరం తెలుసుకుంటూనే ఉంటున్నాం , తరచుగా కలుస్తూనే ఉన్నాం . చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం వల్ల అడ్జెస్ట్ కాలేకపోయామని అసలు విషయాన్నీ చెబుతున్నాడు 53 ఏళ్ల అమీర్ ఖాన్.

- Advertisement -

English Title: Aamir khan comments on divorce with reena dutta

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All