HomeVideos`ది ఫ్యామిలీ మ్యాన్ 2`.. లాస్ట్ సీన్‌లో సామ్ షాకింగ్ లుక్‌!

`ది ఫ్యామిలీ మ్యాన్ 2`.. లాస్ట్ సీన్‌లో సామ్ షాకింగ్ లుక్‌!

`ది ఫ్యామిలీ మ్యాన్ 2`.. లాస్ట్ సీన్‌లో సామ్ షాకింగ్ లుక్‌!
`ది ఫ్యామిలీ మ్యాన్ 2`.. లాస్ట్ సీన్‌లో సామ్ షాకింగ్ లుక్‌!

ద‌క్షిణాది స్టార్స్ కూడా డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారు. ముందుగా ఈ రంగంలోకి స్టార్ హీరోయిన్ స‌మంత డిజిట‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. `ఆహా` ఓటీటీ కోసం `సామ్ జామ్ టాక్ షోని నిర్వ‌హించిన స‌మంత తాజాగా వెబ్ సిరీస్‌తో స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతోంది. బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయ్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన స్పై థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ `ది ఫ్యామిలీ మ్యాన్ `. దీనికి కొన‌సాగింపుగా `ది ఫ్యామిలీ మ్యాన్ 2` త్వ‌ర‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ వెబ్ థ్రిల్ల‌ర్ లో స‌మంత కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. సంక్రాంతి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మేక‌ర్స్ `ది ఫ్యామిలీ మ్యాన్ 2` టీజ‌ర్‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేశారు. `శ్రీ ఎక్క‌డ వున్నావ్.. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయ‌డం లేదు..` అంటూ ప్రియ‌మ‌ణి చెప్పే డైలాగ్‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న టీజ‌ర్ ఆద్యంత ఆస‌క్తిక‌రంగా వుంది.

- Advertisement -

ఆరంభం నుంచి మ‌నోజ్ బాజ్‌పాయ్‌ కుటుంబంతో పాటు అత‌ని వృత్తికి సంబంధించిన విజువ‌ల్స్‌ని చూపించిన మేక‌ర్స్ టీజ‌ర్ చివ‌ర్లో స‌మంత‌ని చూపించి షాకిచ్చారు. ప‌సాధార‌ణ దుస్తుల్లో సాధార‌ణ యువ‌తిగా సామ్ క‌నిపించిన తీరు షాకిస్తోంది. ఇందులో స‌మంత ఉగ్ర‌వాదిలా క‌నిపించ‌బోతోంది. ఇందుకు సంబంధించిన ట్రైల‌ర్‌ని  19న రిలీజ్ చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All