
స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని వారి కోడలు రూల్స్ బ్రేక్ చేస్తోంది. త్వరలో సమంత డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సమంత నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్ 2`. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ ఎన్ డీకే తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సమంత డబ్బింగ్ పూర్తి చేసింది.
తొలి సీజన్ `ఫ్యామిలీ మ్యాన్` బ్లాస్టింగ్ హిట్ కావడంతో సీజన్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో సమంత పాకిస్థానీ టెర్రరిస్టుగా కనిపించబోతోంది. సీజన్ 2లో సామ్ పాత్ర షాకింగ్‌గా వుంటుందని ఈ సిరీస్‌లో నటించిన శరీబ్ హష్మీ ఓ బాలీవుడ్ మీడియాకు వెల్లడించారు. తాజాగా ఇదే విషయాన్ని సమంత కూడా ఇండైరెక్ట్‌గా వెల్లడించింది.
ఓటీటీ ప్లాట్ ఫామ్ రూల్స్ బ్రేక్ చేసే అవకాశం ఇస్తుంది. `ఫ్యామిలీమ్యాన్ 2`తో ఎన్నో రూల్స్‌ని బ్రేక్ చేశాను. ఈ సిరీస్‌లో ప్రయోగం చేశాను. అది చాలా ఎక్స్‌ట్రీమ్‌గా మరింత కొత్తగా షాకింగ్‌గా వుంటుంది` అని సమంత ఓ జాతీయ మీడియాకు వెల్లడించింది. `స్నేహగీతం` ఫేమ్ శ్రేయా దన్వంతరి, శరద్ శేల్కర్, గుల్ పనాగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్నా `ఫ్యామిలీ మ్యాన్ 2` త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.