
తమిళ స్టార్ నటుడు సూర్య అమెజాన్ ప్రైమ్ తో చేసుకున్న డీల్ ప్రకారంగా తన బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ లో రూపొందించిన మొత్తం నాలుగు చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నాయి. సూర్య లాస్ట్ సూపర్ హిట్ చిత్రం ఆకాశం నీ హద్దురా కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే సూర్య నెక్స్ట్ చేసిన చిత్రం జై భీమ్.
సూర్య ప్రధాన పాత్రను పోషించగా రజిష విజయన్ మరో లీడ్ రోల్ చేసింది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రలు పోషించారు. టిజె జ్ఞానవేళ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా జ్యోతికతో సూర్య ఈ సినిమాను నిర్మించాడు. ఈరోజు అమెజాన్ ప్రైమ్ జై భీమ్ విడుదల తేదీని ప్రకటించింది. దీపావళి సందర్భంగా నవంబర్ 2 నుండి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
ఈ చిత్రంలో సూర్య లాయర్ గా నటించాడు. అయితే దీనికన్నా ముందు జ్యోతిక లీడ్ రోల్ లో చేసిన ఉదంపిఱపె చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రం జ్యోతిక 50వ చిత్రం కావడం విశేషం. తెలుగులో ఈ చిత్రానికి రక్తసంబంధం అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేయగా అక్టోబర్ 14న ప్రైమ్ లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు.