Homeటాప్ స్టోరీస్సూపర్ హిట్ కొట్టేసిన పడిపడి లేచె మనసు

సూపర్ హిట్ కొట్టేసిన పడిపడి లేచె మనసు

Super hit talk to sharwanand's padipadileche manasu శర్వానంద్సాయి పల్లవి జంటగా నటించిన పడిపడి లేచె మనసు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈరోజు భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రానికి ఓవర్ సీస్ లో కూడా ఆదరణ లభిస్తోంది . హృదయానికి హత్తుకునే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో హైలెట్స్ ఒక్కటని చెప్పలేం ఎందుకంటే శర్వానంద్ – సాయి పల్లవి జంట అద్భుత నటనతో ఆకట్టుకోగా అదే స్థాయిలో విశాల్ చంద్ర శేఖర్ అందించిన సంగీతం కూడా హైలెట్ గా నిలిచింది .

ఇక వీటికి తోడు హను దర్శకత్వ ప్రతిభ కూడా తోడవ్వడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు పడిపడి లేచె మనసు చిత్రానికి . యువతకు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమాతో శర్వానంద్ మరోసారి మేజిక్ చేయగా హను రాఘవపూడి కూడా భారీ డిజాస్టర్ నుండి సూపర్ హిట్ వైపు అడుగులు వేసాడు . ఈ సినిమాకు ముందు లై అనే డిజాస్టర్ తో చతికిల బడ్డాడు హను , అయితే శర్వా మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ అని చూడకుండా కథ ని నమ్మి సినిమా చేసాడు కట్ చేస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు హను . మొత్తానికి పడిపడి లేచె మనసు చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసి సంతోషంతో ఉన్నారు ఆ చిత్ర బృందం .

- Advertisement -

English Title: Super hit talk to sharwanand’s padipadileche manasu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All