HomeAudio Reviewsపడిపడి లేచె మనసు పాటల రివ్యూ

పడిపడి లేచె మనసు పాటల రివ్యూ

Padipadileche manasu songs review
Sharwanand and Sai Pallavi

శర్వానంద్ సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మించిన చిత్రం ” పడిపడి లేచె మనసు ”. విభిన్న కథా చిత్రాల హీరోగా శర్వానంద్ కున్న ఇమేజ్ ని ఈ సినిమా మరింతగా ఎలివేట్ చేస్తుందని నమ్మకంగా ఉన్నాడు శర్వానంద్ . విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఆరు పాటలను కృష్ణకాంత్ రాయడం విశేషం . అలాగే అన్ని పాటలు కూడా శ్రోతల మెప్పు పొందేలా ఉండటంతో పడిపడి లేచె మనసు ఆల్బమ్ హిట్ అయ్యింది .

!) పడిపడి లేచెమనసు అనే టైటిల్ సాంగ్ ని ఆర్మన్ మాలిక్ , సింధూరి విశాల్ ఆలపించిన ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా అలరించడం ఖాయం .

- Advertisement -

2) కల్లోలం అనే రెండో పాటని అనురాగ్ కులకర్ణి ఆలపించాడు . ఓ ప్రేమికుడి ఆవేదనతో ఈ పాట సాగుతుంది .

3) హృదయం జరిపే అనే మూడో పాటని యాజిన్ నైజర్ ఆలపించాడు . కాగా ఈ పాట కూడా యువతని అలరించడం ఖాయం .

4) ఏమై పోయావే నీవెంటే నేను ఉంటే అనే నాల్గో పాటని తెలంగాణ మాండలికంలో రాసాడు కృష్ణకాంత్ ఈ పాట కూడా విశేషంగా అలరించేలా సాగింది .

5) ఓ మై లవ్లీ లలనా అంటూ సాగె ఐదో పాటని సింధూరి విశాల్ ఆలపించారు ఈ పాటకూడా శ్రోతలను అలరించేలా ఉంది

 6) ఉరికే చెలి చిలకా అంటూ  పాటని రాహుల్ , మానసి ఆలపించారు . ఈ పాట కూడా బాగుంది .

మొత్తానికి ఈ  ఆరు పాటలు ఉండగా ఒక్కో పాట ఒక్కోలా ఉండి విభిన్నతని చాటాయి . ఇక అన్ని పాటలు కూడా కృష్ణకాంత్ రాయడం విశేషం . ఇక ఈ  సినిమాని ఈనెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English Title: Padipadileche manasu songs review

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All