Homeటాప్ స్టోరీస్బాహుబలి 3 చేయాలనీ ఆలోచన చేస్తున్నాడట

బాహుబలి 3 చేయాలనీ ఆలోచన చేస్తున్నాడట

ss rajamouli eyes on baahubali 3బాహుబలి , బాహుబలి 2 ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచిన చిత్రాలు అవి కాగా ఇప్పుడు ఆ బాహుబలి కి మూడో భాగం కూడా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి . జక్కన్న అంతకుముందే బాహుబలి సిరీస్ ఆగిపోదు అని చెప్పాడు కానీ ఇప్పుడే మళ్ళీ ఆ సినిమా కు సీక్వెల్ చేసే ఆలోచన లేదని చెప్పాడు కూడా . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి 3 కి కథ కూడా సిద్దమై పోయిందట కాకపోతే పూర్తి స్క్రిప్ట్ మాత్రం సిద్ధం కాలేదు .

తండ్రి విజయేంద్ర ప్రసాద్ బాహుబలి 3 కథ రాసాడట ! లైన్ ఒకే అయ్యిందని మిగతా స్క్రిప్ట్ వర్క్ జరగాలని తెలుస్తోంది . ప్రస్తుతం జక్కన్న ఎన్టీఆర్చరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా తర్వాత సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు . అది కంప్లీట్ అయ్యాక బాహుబలి 3 పై దృష్టి సారిస్తాడేమో చూడాలి . బాహుబలి ప్రభంజనం కు ఈ బాహుబలి 3 సరిపోయేలా ఉంటుందా ? ఆ స్థాయి విజయాన్ని నమోదు చేస్తుందా ? చూడాలి .

- Advertisement -

English Title: ss rajamouli eyes on baahubali 3

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All