సైరా ….. నరసింహా చిత్రంలో చిన్న వేషం వేయడానికి ఆ చిత్ర నిర్మాత అయిన చరణ్ కాళ్ళు పట్టుకొని మరీ బ్రతిమిలాడిందట మెగా డాటర్ నిహారిక. ఈ విషయాన్ని స్వయంగా నిహారిక వెల్లడించడం విశేషం. నిహారిక వ్యాఖ్యలు నిజంగా సంచలనం సృష్టిస్తున్నాయి. సైరా ….. నరసింహా చిత్రంలో పెద్దనాన్న చిరంజీవి హీరోగా నటిస్తుండగా చరణ్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సైరా…..ప్రతిష్టాత్మక చిత్రం కాబట్టి అందులో ఎలాగైనా సరే చిన్న పాత్ర అయినా చేయాలని ఆశపడిందట నిహారిక అందుకే చరణ్ ని బ్రతిమిలాడిందట సరిగ్గా అదే సమయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా రావడంతో నిహారిక ని తప్పనిసరిగా మన సినిమాలో ఉంచాలని ఓ గిరిజన యువతి పాత్ర ఇచ్చాడట.
సైరా ….. చిత్రంలో నటించడం నా అదృష్టమని అంటోంది నిహారిక. ఇక ఈ భామ నటించిన తాజా చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ఈనెల 28న విడుదల అవుతోంది. కాగా ఆ సినిమా విజయం పట్ల నమ్మకంగా ఉంది నిహారిక. ఈ భామ ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయ మయ్యింది కానీ ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో కొంత గ్యాప్ తీసుకుని హ్యాపీ వెడ్డింగ్ తో వస్తోంది. మరి ఈ సినిమా తో హిట్ కొడుతుందా చూడాలి.
English Title: niharika play small role in syraa narasimha reddy