
సిన్మా ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్ సత్యభామ’.చిత్రం ఈ నెల డిసెంబర్ 31 న థియేటర్లలో విడుదలవుతుంది.
సోనీ అగర్వాల్ మాట్లాడుతూ… ‘7జి బృందావన్ కాలనీ’ చిత్రం తర్వాత నాకు అంతగా గొప్పగా పేరు తెచ్చిన సినిమాలు లేవు కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో అంత క్రేజ్ తెచ్చే మూవీ ఈ “డిటెక్టివ్ సత్యభామ” ఆవుతుంది ఎందుకంటే మూవీ పోస్టుపొడక్షన్ అంత ముంబైలో పూర్తి చేసి ఫస్ట్ కాపీ నాకు ముంబయి లో చూపించారు నాకు చాలా బాగా నచ్చింది , ఈ నెల 28 నుండి హైదరాబాద్ లో ఉండి చిత్ర యూనిట్ తో ప్రమోషన్స్ లో పాల్గొంటానని చెప్పారు.
చిత్ర నిర్మాత శ్రీశైలం పోలెమోని మాట్లాడుతూ .. చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్ని అంగులతో తీర్చి దిద్దామని చిత్రాన్ని ఈ నెల డిసెంబర్ 31 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నామని అన్నారు.
దర్శకుడు నవనీత్ చారి మాట్లాడుతూ .. ‘డిటెక్టివ్ సత్యభామ’.చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించానని ఇందులో నాలుగు పాటలు కథలో భాగంగా యాక్షన్స్ సీన్స్ కూడా ఉంటాయి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమౌతున్నాని అన్నారు .
నటీ నటులు :
సోని అగర్వాల్, సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్, భరత్ తదితరులు.
ఇవి కూడా చదవండి:
సూపర్ క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ” షూటింగ్ పూర్తి – ఫస్ట్ లుక్ త్వరలో!
టాలీవుడ్ లో మరో విషాదం – కాన్సర్ తో పోరాడుతున్న టాలీవుడ్ స్టార్
21 సంవత్సరాల తరవాత విశ్వ సుందరి టైటిల్ ని సొంతం చేసుకున్న భారత్