Homeటాప్ స్టోరీస్టాలీవుడ్ లో మరో విషాదం - కాన్సర్ తో పోరాడుతున్న టాలీవుడ్ స్టార్

టాలీవుడ్ లో మరో విషాదం – కాన్సర్ తో పోరాడుతున్న టాలీవుడ్ స్టార్

టాలీవుడ్ లో మరో విషాదం - కాన్సర్ తో పోరాడుతున్న టాలీవుడ్ స్టార్
టాలీవుడ్ లో మరో విషాదం – కాన్సర్ తో పోరాడుతున్న టాలీవుడ్ స్టార్

టాలీవుడ్ లో వరసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. హట్ఠతు మరణాలు. అనార్యోగంతో బాధపడటం ఇలా తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం. ఇటీవలి తాజాగా తెలుగులో అత్తారింటికి దారేది, మిర్చి, వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్ ఆపిరన్సు ఇచ్చిన టాలీవుడ్ హాట్ స్టార్ హంస నందిని కాన్సర్ తో పోరాడుతున్నట్టుగ సమాచారం. చాలా కాలం నుంచి సినిమాలకు, సోషల్ మీడియాకు, దూరంగా ఉన్న ఈ భామ కాన్సర్ బారిన పడినట్టుగా చెప్పి షాక్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో రీసెంట్ గ ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ ‘కాలం నా జీవితంలో ఎలాంటి ప్రభావాలు చూపించిన భాతురాలుగా ఉండాలని అనుకోవడం లేదు, భయం, నెగిటివిటీతో నేను జీవించను.. ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ముందడుగు వేయాలనుకుంటున్న అంటూ, పద్దెనిమిది ఏళ్ళ క్రితం తన తల్లి కాన్సర్ తో మరణించింది అని అప్పటి నుండి అదే భయంతో బ్రతుకుతున్న అని ఎమోషనల్ గా పోస్ట్ చేసారు.
నాలుగు నెలల క్రితం తన బ్రెస్ట్ లో ఒక కణితి ఉన్నట్టుగా గమనించి డాక్టర్ ని సంప్రదించగ పలు టెస్ట్ లు చేసి గ్రేడ్ త్రీ బ్రెస్ట్ కాన్సర్ అని తేలింది అని తెలిపారు హంస నందిని. కాన్సర్ ని ముందుగానే గుర్తుంచడం వల్లా ప్రమాదం ఏమీ లేదు అని భావించారని సర్జరీ చేసి కణితిని తొలగించారని తెలిపి కానీ ఆ సంతోషం ఎంత కాలం ఉండలేదు అంటూ తనకి జన్యుపరమైన కాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు గమనించి దీని వలన బ్రెస్ట్ కాన్సర్ వచ్చే అవకాశం డబ్భైశాతం లేదా గర్భాశయ కాన్సర్ వచ్చే అవకాశం నలభైశాతం ఉందంటూ నిర్దారించారు. దీని నుండి తప్పుకోడానికి సర్జరీలు ఒక్కటే దారి అని తెలిపారు.
మరో మూడేళ్ళ పాటు ట్రీట్మెంట్ కొనసాగించాల్సి ఉందని ప్రస్తుతానికి కీమోతేరపి చేయించుకుంటున్నట్టు తెలిపారు. ఈ మహమ్మారికి నా  జీవితం అంకితం చెయ్యాలని లేదు అని నవ్వుతు దైర్యంగా పోరాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనా తన  దైర్యం చూస్తుంటే తొందరగా కోలుకుంటారు అని కోరుకుంటు మరింత దైర్యం చేకూరాలని ఆశిస్తున్నాం.

 

View this post on Instagram

 

A post shared by Hamsa Nandini (@ihamsanandini)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All