Homeటాప్ స్టోరీస్21 సంవత్సరాల తరవాత విశ్వ సుందరి టైటిల్ ని సొంతం చేసుకున్న భారత్

21 సంవత్సరాల తరవాత విశ్వ సుందరి టైటిల్ ని సొంతం చేసుకున్న భారత్

21 సంవత్సరాల తరవాత విశ్వ సుందరి టైటిల్ ని సొంతం చేసుకున్న భారత్
21 సంవత్సరాల తరవాత విశ్వ సుందరి టైటిల్ ని సొంతం చేసుకున్న భారత్

ఇటీవలి జరిగిన 70 వ విశ్వ సుందరి వేడుకల్లో ఇశ్రాయేల్ ఇలాట్ వేదికగా భారత్ యువతి ఐన హర్నాజ్ సంధు కిరీటం దక్కించుకుంది. గతంలో సుష్మిత సెన్ 1994 లో మరియు లారా దుట్టా 2000 లో ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు ఆ తరువాత తాజాగా జరిగిన పోటీల్లో విజయం సాధించి మూడవ భారత విశ్వసుందరిగా నిలిచింది హర్నాజ్ సంధు.80 మందిని వెనక్కి నెట్టి ఈ కిరీటాన్ని దక్కించుకోవడం అన్నది మామూలు విషయం కాదు. మిస్ సౌత్ ఆఫ్రికా లలీల మాస్వాన్ మరియు మిస్ పరాగ్వే నదియా ఫెర్రేయిరాను  దాటి హర్నాజ్ సంధు విశ్వసుందరి గ నిలిచింది.అయితే హర్నాజను విజేత నిలిపిన ప్రశ్న ఏంటి అనే ఆశక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.

మరి ఆ ప్రశ్న ఏంటో తెలుసుకుందామా ?
ఫైనల్ రౌండ్ లో ఫైనలిస్టుగా ముగ్గురు మిగిలారు.వీరిని జడ్జిలు అడిగిన ప్రశ్న “ఈ షో చూస్తున్న మహిళలకు మీరు ఇచ్చే సలహా ఏంటి”. మిస్ సౌత్  ఆఫ్రికా, మిస్ పరాగ్వే తో పాటు మిస్ ఇండియా కూడా చక్కగా సమాధానం ఇచ్చి చివరి రౌండ్ ని ముగించారు. ముగ్గురిలో అత్యుత్తమ సమాధానం చెప్పిన హర్నాజ్ ను విజేతగ ప్రకటించి మిస్ మెక్సికో నుంచి కిరీటాన్ని మిస్ ఇండియా కు అందించారు.
మరి ఆమెను విజేతగ నిలిపిన ఆ సమాధానం ఏంటి అంటే:
యువతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు.. తమను తాము నమ్మకపోవడం. మీకు మీరే ప్రత్యేకం అని నమ్మండి.. అదే మిమ్మల్ని అందంగా చేస్తుంది. ఇతరులుతో పోల్చుకోవడం ఆపేసి.. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి మాట్లాడండి. భయాల నుంచి బయటకు రండి.. మీ గురించి మీరే మాట్లాడండి.. ఎందుకంటే మీ జీవితానికి మీరే లీడర్‌.. నన్ను నేను నమ్మాను.. అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నిల్చోగలిగాను’’ అని సమాధానమిచ్చారు హర్నాజ్‌.
ఆమె సమాధనం జడ్జిలతో పాటు ప్రజలను కూడా ఆకట్టుకుంది దాంతో స్టీవ్ హార్వే ఆమెను విజేతగ ప్రకటించడంతో స్టేడియం మొత్తం సందడి నెలకుంది.  తన పేరును విజేతగా ప్రకటించిన వెంటనే హర్నాజ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం ఉదయం పోటీ ప్రారంభమైనప్పుడు, టాప్ 16 లో ఉన్న హర్నాజ్ స్విమ్‌సూట్ రౌండ్ తర్వాత, ఆమె టాప్ 10లో నిలిచారు.ఆలా ఫైనల్ రౌండ్ లో టాప్ ౩ కే చేరుకొని చివరిగా విజేతగా నిలిచారు.ఈ పోటీలో మొదటి రన్నరప్‌గా మిస్ పరాగ్వే, రెండో రన్నరప్‌గా మిస్ సౌత్ ఆఫ్రికా నిలిచారు.
ఇవి కూడా చదవండి:
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All