
రాజమౌళి ని మన టాలీవుడ్ కి దర్శక రాజు అనుకోవటం లో సందేహమే లేదు. ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులను ఆకట్టుకునే విధానంలో రాజీపడని దర్శకుడు అందుకు బహుబలి పెద్ద ఉదాహరణ. ఇప్పుడు రాబోతున్న మల్టీ స్టార్రర్ సినిమా RRR పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. ట్రైలర్ రిలీజ్ తరవాత ఈ సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాస్తుందని సినీ ప్రముఖుల అంచనాలు. అలాగే రాజమౌళికి ఈ మధ్య హాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వచ్చినట్టు కొన్ని కథనాలు వినిపించాయి.
ఆ విషయం పై రీసెంట్ గా బాలీవుడ్ మీడియా తో మాట్లాడుతూ ఎలా క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. హాలీవుడ్ లో తనకేం ఛాన్సులు రాలేదని కానీ ఇండియన్ స్టోరీని హాలీవుడ్ తెరకి ఎక్కించాలి అనుకున్నట్టు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా భారతీయ అనుకరాలతో ఉన్న కథను హాలీవుడ్ తెరపై చూపించాలన్నదే తన కోరిక అంటూ తనదైన శైలులో వివరించి అందరి మనసులను ఆకట్టుకున్నారు.
బాలీవుడ్లో ప్రముఖులు కూడా రాజమౌళి సినిమాలో నటించుటకు సిద్ధంగా ఉన్న అతను టాలీవుడ్ హీరోలకి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నారు.మన భారతీయ కథలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి అన్న ఆలోచన మామూలు విషయం ఎం కాదు. ఏదేమైనా, రాజమౌళి అభిమానులుమన గా మన అందరికి ఉన్న నమ్మకం అయితే మాత్రం అయన హాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ కి వెళ్లిన ఆశ్యర్యపోనవసరం లేదు.
ఇవి కూడా చదవండి:
రాజమౌళి, మహేష్ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్..!
సల్మాన్ ఖాన్ ను ముంబైలో కలిసిన రాజమౌళి.. విషయమేంటి?
ఆర్ ఆర్ ఆర్ రన్ టైంను లాక్ చేసిన రాజమౌళి