Homeన్యూస్మహేష్ - త్రివిక్రమ్ మూవీ లో శోభన..?

మహేష్ – త్రివిక్రమ్ మూవీ లో శోభన..?

మహేష్ - త్రివిక్రమ్ మూవీ లో శోభన..?
మహేష్ – త్రివిక్రమ్ మూవీ లో శోభన..?

సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పూజా కార్య క్రమాలు పూర్తి చేసుకోగా..ప్రస్తుతం త్రివిక్రమ్ ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాల్లో బిజీ గా ఉన్నారు. ఈ తరుణంలో ఈ మూవీ లో మహేష్ కు పిన్ని రోల్ కు గాను సీనియర్ నటి శోభన ను అనుకుంటున్నారట.

గత చిత్రాలు ‘అత్తారింటికి దారేది’లో నదియా,  ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో స్నేహా, , ‘అజ్ఞాతవాసి’లో ఖుష్బూ, ‘అరవింద సమేత’లో దేవయాని, ‘అల వైకుంఠపురంలో’ టబు వంటి సీనియర్ నటీమణులను తీసుకొని ఆ పాత్రలకే హైలైట్ గా చేయగా..ఇప్పుడు శోభనను తీసుకోవాలని చూస్తున్నారట. తెలుగు సినిమాలకి దూరమై చాలా కాలమైన ఆమెను కొత్తగా తీసుకుని రావడం వలన ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుందని అంత భావిస్తున్నారట.

- Advertisement -

ఒకప్పుడు తెలుగు లో ‘కోకిల’ , ‘అభినందన’ , ‘నారీ నారీ నడుమ మురారి’ , ‘ రౌడీగారి పెళ్ళాం’ , ‘రౌడీ అల్లుడు’ , ‘రుద్రవీణ’ వంటి చిత్రాలు ఈమెకు ఎంతో పేరును తీసుకొచ్చాయి. 1993లో ‘రక్షణ’ తరువాత మళ్లీ ఆమె మంచు విష్ణు ‘గేమ్’ సినిమాలో కేరక్టర్  ఆర్టిస్టుగా కనిపించింది. మళ్లీ తెలుగు ఇండస్ట్రీ లో కనిపించలేదు. మరి ఇప్పుడు త్రివిక్రమ్ నుండి పిలుపు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రీ ఎంట్రీ ఇస్తుందని అభిమానులు అంకుంటున్నారు. ఇక ఈ మూవీ లో మెయిన్ హీరోయిన్ గా పూజా హగ్దే ను ఎంపిక చేయగా..సెకండ్ హీరోయిన్ లిస్ట్ లో పలువురి భామల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి ఆ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All