
బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ వీక్ కు ఇంకా రెండు వారాలు ఉండగానే ఇదే ఫైనల్ వీక్ అని నిన్న ప్రకటించేశాడు బిగ్ బాస్. ఈ నేపథ్యంలో హౌజ్ మేట్స్ అందరూ ఎలాగైనా లాస్ట్ కెప్టెన్సీ సొంతం చేసుకోవాలని కోరుకున్నారు. లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా నియంత కుర్చీలో ఎవరైతే ముందు కూర్చుంటారో వారు ఛాలెంజ్ ను ఫేస్ చేసి బాటమ్ 2 వచ్చిన వారిలో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా టాస్క్ నుండి ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు.
సన్నీ, శ్రీరామ్ చంద్ర, మానస్, కాజల్ లు కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనలేరు. ఇంకా టాస్క్ లో ప్రియాంక, రవి, షణ్ముఖ్, సిరిలు ఉన్నారు. మరి వీరిలో ఎవరు టాస్క్ గెలిచి ఇంటి తదుపరి కెప్టెన్ అవుతారు అన్నది చూడాల్సి ఉంటుంది. ప్రియాంక ఇప్పటివరకూ కెప్టెన్ అవ్వలేదు కాబట్టి తనకేమైనా ఛాన్స్ ఉంటుందేమోనని అందరూ భావిస్తున్నారు కానీ అది తప్పు.
తాజా సమాచారం ప్రకారం ఇంటి లాస్ట్ కెప్టెన్ గా షణ్ముఖ్ నిలిచాడని తెలుస్తోంది. అలాగే ఈరోజు ఫ్యామిలీ ఎపిసోడ్ కూడా మొదలవుతుందని సమాచారం. అంటే హౌజ్ మేట్స్ ఫ్యామిలీలు హౌజ్ లోకి ఎంటర్ అవుతారన్నమాట. ఈ వారమంతా ఇదే ఉంటుంది. ఫ్యామిలీలను చాలా కాలం తర్వాత కలుస్తుండడంతో కచ్చితంగా ఎమోషనల్ గా ఉండే అవకాశముంది.