Homeన్యూస్బిగ్ బాస్ 5: షణ్ముఖ్ కు ఈ మాస్ ఓటింగ్ ఎలా?

బిగ్ బాస్ 5: షణ్ముఖ్ కు ఈ మాస్ ఓటింగ్ ఎలా?

బిగ్ బాస్ 5: షణ్ముఖ్ కు ఈ మాస్ ఓటింగ్ ఎలా?
బిగ్ బాస్ 5: షణ్ముఖ్ కు ఈ మాస్ ఓటింగ్ ఎలా?

బిగ్ బాస్ 5 లో మరో వారం ముగుస్తోంది. ఈ వారాంతం హౌజ్ లో నుండి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు. ఈసారి ఏకంగా 9 మంది నామినేట్ అయిన విషయం తెల్సిందే. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తొలిసారి నామినేషన్స్ కు వచ్చాడు. తను కాకుండా జెస్సీ, లోబో, మానస్, విశ్వ, హమీద, ప్రియా, సన్నీ, రవిలు నామినేట్ అయ్యారు.

సాధారణంగా నామినేషన్స్ సమయంలో ఎవరికి తక్కువ ఓట్లు వస్తున్నాయన్న ట్రెండ్ ను ఫాలో అవుతారు. ఎందుకంటే తక్కువ ఓటింగ్స్ వచ్చిన వాళ్ళే కదా ఎలిమినేట్ అయ్యేది. ఈ విషయంలో విశ్వ, హమీదలకు రిస్క్ ఎక్కువగా ఉంది. అయితే టాప్ ఓటింగ్స్ మాత్రం ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే షణ్ముఖ్ జస్వంత్ కు వస్తోన్న ఓట్లు అలా ఉన్నాయి. ఎక్కువ ఓట్లు షణ్ముఖ్ కే పడుతున్నాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మొత్తం ఓట్లలో దాదాపు 40 శాతం ఓట్లు కేవలం షణ్ముఖ్ కే వస్తున్నాయి. తను టాప్ లో ఉండగా, సెకండ్ బెస్ట్ కు తనకు వేల ఓట్ల వ్యత్యాసం ఉంది.

- Advertisement -

ఇదంతా ఎలా జరుగుతోంది? నిజంగా షణ్ముఖ్ కు ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందా? సోషల్ మీడియాలో తన యూట్యూబ్ వీడియోస్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న షణ్ముఖ్ కు వస్తోన్న ఓటింగ్స్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All