Homeటాప్ స్టోరీస్ఒకే రోజున 7 సినిమాలా

ఒకే రోజున 7 సినిమాలా

seven movies releasing on june 29 thఈనెల 29న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి . ఏడు సినిమాలు కూడా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నాయి అయితే ఒకేరోజున 7 సినిమాలు విడుదల అంటే థియేటర్ ల సమస్య వస్తుంది దాంతో కొన్ని సినిమాల విడుదల ఆగిపోవచ్చు . ఇక ఈ ఏడు సినిమాలలో చెప్పుకోతగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది ఒక్క ” ఈ నగరానికి ఏమైంది ” చిత్రం మాత్రమే ! దాస్యం తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చిత్రం తర్వాత దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ నగరానికి ఏమైంది పై అంచనాలు ఉన్నాయి .

ఇక మిగతా సినిమాలలో జబర్దస్త్ తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరించి వెండితెర మీద కూడా సక్సెస్ అయిన షకలక శంకర్ హీరోగా నటించిన ” శంభో శంకర ” , నందు హీరోగా నటించిన ” కన్నుల్లో నీ రూపమే ”, రవి వీడే ” సంజీవని ”, ” నా లవ్ స్టోరీ ” , రవి చావలి దర్శకత్వం లో తెరకెక్కిన ” సూపర్ స్కెచ్ ” , మలయాళ డబ్బింగ్ చిత్రం అయినప్పటికీ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో పాటు అల్లు శిరీష్ నటించిన ” యుద్ధ భూమి ” చిత్రం కూడా విడుదలకు సిద్ధం అయ్యింది . అంటే మొత్తంగా 7 సినిమాలు రెడీ అవుతున్నాయి . మరి ఈ 7 చిత్రాల్లో ఎన్ని విడుదల అవుతాయో ? ఎన్ని పోస్ట్ పోన్ అవుతాయో ? ఏవి విజయం సాధిస్తాయో ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All