
నటసింహ నందమూరి బాలకృష్ణ తో `శ్రీమన్నారాయణ`, ఒకప్పటి ఫ్యామిలీ హీరో జగపతి బాబుతో `సామాన్యుడు`, అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ తో `దగ్గరగా దూరంగా`, యూత్ స్టార్ నితిన్ తో `విక్టరీ`, యంగ్ హీరో ఆదితో `ప్యార్ మే పడిపోయా`, `ది ఎండ్` వంటి హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు రవి కుమార్ చావలి. తాజాగా ఆయన మరికొంత మంది కొత్త వాళ్లను ప్రోత్సహిస్తూ తెరకెక్కిస్తోన్న చిత్రమే `సూపర్ స్కెచ్`. నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్ టోనీ (ఇంగ్లండ్) ఇందులో కీలక పాత్రధారులు. యారో సినిమాస్ సమర్పణలో యు అండ్ ఐ- ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో శ్రీ శుక్ర క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న చిత్రమిది.
సినిమా గురించి దర్శకుడు రవికుమార్ చావలి మాట్లాడుతూ మాట్లాడుతూ “గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో, వైవిథ్యమైన పాయింట్ తో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాం. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో భాగంగా డబ్బింగ్ జరుగుతోంది. మన వాళ్లతో పాటు విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్ టోని (ఇంగ్లండ్) పాత్రలు కూడా మెప్పిస్తాయి. సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తుండగా, జునైద్ ఎడిటింగ్, కార్తీక్ కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. సుభాష్, నారాయణ్, ఇంజపూరి, ప్రియాంక సాహిత్యం సమకూర్చారు. యారో సినిమాస్ సమర్పణలో యు అండ్ ఐ- ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో శ్రీ శుక్ర క్రియేషన్స్ ప్రొడక్షన్స్ పై బలరామ్ మక్కల ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్నారు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది“ అని అన్నారు.
- Advertisement -