Homeటాప్ స్టోరీస్ఈ నగరానికి ఏమైంది ట్రైలర్ వచ్చింది

ఈ నగరానికి ఏమైంది ట్రైలర్ వచ్చింది

ee nagaraniki emaindi trailer outపెళ్లి చూపులు చిత్రంతో సంచలన విజయం సాధించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తాజాగా ” ఈ నగరానికి ఏమైంది ” అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు . సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదల అయ్యింది . కొత్త వాళ్లతో ఈ చిత్రాన్ని రూపొందించాడు తరుణ్ భాస్కర్ . పెళ్లి చూపులు తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చేసాడు ఈ సినిమా . ఇక ఈ సినిమాలో కూడా తెలంగాణ స్లాంగ్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు తరుణ్ .

తాజాగా విడుదలైన ట్రైలర్ కుర్రకారు కి బాగా నచ్చేలా ఉంది . ఈ నగరానికి ఏమైంది అన్నది బాగా పాపులర్ అయిన డైలాగ్ . సినిమా ప్రారంభానికి ముందు థియేటర్ లో వచ్చే యాడ్ డైలాగ్ ని టైటిల్ గా పెట్టడమే పెద్ద ప్లస్ అయ్యింది . ఇక తరుణ్ డైలాగ్స్ ఎలా ఉంటాయో ఇంతకుముందు పెళ్లి చూపులు చిత్రంలో చూపించిన విషయం తెలిసిందే . ఇక ఈ సినిమాలో కూడా అలాగే తెలంగాణ స్లాంగ్ ని వాడుకున్నాడు దాంతో యువతరానికి ఈ సినిమా నచ్చడం ఖాయంగా కనిపిస్తోంది మరి . త్వరలోనే ” ఈ నగరానికి ఏమైంది ” చిత్రం విడుదల కానుంది .

- Advertisement -

 

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All