Homeన్యూస్సీటిమార్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది!

సీటిమార్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది!

సీటిమార్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది!
సీటిమార్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది!

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా రూపొందిన ఆరడుగుల బుల్లెట్ ఈరోజు విడుదలైంది. నిజానికి ఇది మూడేళ్ళ క్రితం రూపొందిన చిత్రం. వివిధ కారణాల వల్ల వాయిదాలు పడి మొత్తానికి ఈరోజు విడుదలైంది. ఇదిలా ఉంటే గోపీచంద్ నటించిన మరో చిత్రం ఇప్పుడు ఓటిటిలో విడుదలవుతోంది. గోపీచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన సీటిమార్, థియేటర్లలో సెప్టెంబర్ 10న విడుదలైంది. ఈ సినిమాకు రివ్యూలు, ప్రేక్షకుల నుండి స్పందన కూడా డీసెంట్ గా వచ్చింది.

కలెక్షన్స్ కూడా ఫస్ట్ వీక్ బాగున్నా తర్వాత కొంచెం డల్ అయ్యి మొత్తానికి యావరేజ్ సక్సెస్ గా నిలిచింది. ఇప్పుడు నెల రోజుల తర్వాత సీటిమార్ ఓటిటిలో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధమైంది. డిస్నీ+ హాట్ స్టార్ లో సీటిమార్ స్ట్రీమ్ కానుంది. అక్టోబర్ 15 నుండి దసరా పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని అందుబాటులో ఉంచనున్నారు.

- Advertisement -

కబడ్డీ నేపథ్యంలో పూర్తి స్థాయి మాస్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. మణిశర్మ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ చిత్రాన్ని అక్టోబర్ 15 నుండి డిస్నీ + హాట్ స్టార్ యాప్ లో వీక్షించవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All