
నేషనల్ వైడ్ గా క్లిక్ అయిన కొన్ని షోస్ ప్రాంతీయ భాషల్లో సక్సెస్ అవుతాయి అన్నది చెప్పడం కష్టం. ఎందుకంటే నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కౌన్ బనేగా కరోడ్ పతి.. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడుగా వచ్చింది. ఇదే క్రమంలో బిగ్ బాస్ కూడా చాలా పాపులర్ అయ్యింది. అయితే ఇదే ఉత్సాహంతో మాస్టర్ చెఫ్ షో కూడా తెలుగులో ఘనంగా ప్రారంభించారు.
జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఈ షోని మిల్జీ బ్యూటీ తమన్నా హోస్ట్ గా చేస్తుంది. ఈ షో కోసం తమన్నాకి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అయితే షో కోసం పెడుతున్న బడ్జెట్ తో పోల్చుకుంటే షోకి తక్కువ రేటింగ్స్.. రెవిన్యూ వస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ షో నుండి తమన్నాని తప్పించే ఆలోచనల్లో ఉన్నారట.
తమన్నా ప్లేస్ లో జబర్దస్త్ యాంకర్ అనసూయని మాస్టర్ చెఫ్ కి హోస్ట్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ జబర్దస్త్ షోతో సూపర్ పాపులర్ అయిన అనసూయ మాస్టర్ చెఫ్ షోకి వస్తే.. షోకి మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.