Homeన్యూస్భీమ్లా నాయక్: రానా సరసన మలయాళీ భామ

భీమ్లా నాయక్: రానా సరసన మలయాళీ భామ

భీమ్లా నాయక్: రానా సరసన మలయాళీ భామ
భీమ్లా నాయక్: రానా సరసన మలయాళీ భామ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే.  ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. భీమ్లా నాయక్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి పాత్రలు ఈ చిత్రంలో చాలా స్పెషల్ గా డిజైన్ చేసారని సమాచారం.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యా మీనన్ నటిస్తోందన్న విషయం తెల్సిందే. ఇప్పటికే భీమ్లా నాయక్ నుండి రెండు పాటలు విడుదలవ్వగా రెండూ కూడా సూపర్ హిట్ సాధించాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ టీమ్ మరో అప్డేట్ ను వచ్చింది.

- Advertisement -

రానా దగ్గుబాటికు పెయిర్ గా మలయాళీ భామ సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. భీమ్లా నాయక్ లో డేనియల్ శేఖర్ గా నటిస్తోన్న రానా దగ్గుబాటి భార్యగా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ చిత్రంలో చేయడం పట్ల సంయుక్త మీనన్ కూడా ఎగ్జైటెడ్ గా ఉంది.

సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను అందించాడు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All