
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఒక కొత్తమ్మాయి నటించబోతోంది అంటూ వార్త చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. రీసెంట్ గా మొదలైన ఈ రూమర్ ఇప్పుడు బలంగా నాటుకుపోయింది. పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. భీమ్లా నాయక్, హరిహర వీర మల్లు, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాల తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది. ఇదిలా ఉంటే సురేందర్ రెడ్డి ఈ గ్యాప్ లో అఖిల్ తో ఏజెంట్ సినిమాను తీస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా విషయానికొస్తే ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయిని తీసుకున్నట్లు రూమర్స్ బలంగా వస్తున్నాయి. పవన్-సురేందర్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తుందని తెలుస్తోంది.
అయితే సాక్షి వైద్య పేరు ఏజెంట్ హీరోయిన్ గా కూడా చక్కర్లు కొట్టింది. మరి ఏజెంట్ లో కూడా సాక్షి నటిస్తోందా లేదా అన్నది క్లారిటీ లేదు కానీ పవన్ సరసన మాత్రం ఫిక్స్ అంటున్నారు. రామ్ తాళ్లూరి ఇప్పటికే హీరోయిన్ చేత అగ్రిమెంట్ మీద సైన్ కూడా పెట్టించేసుకున్నారట. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరింత సమాచారం వచ్చే ఏడాది ప్రారంభంలో తెలిసే అవకాశముంది.