Homeగాసిప్స్మలయాళ రీమేక్ పై ఆసక్తి చూపిస్తోన్న నాగ్

మలయాళ రీమేక్ పై ఆసక్తి చూపిస్తోన్న నాగ్

మలయాళ రీమేక్ పై ఆసక్తి చూపిస్తోన్న నాగ్
మలయాళ రీమేక్ పై ఆసక్తి చూపిస్తోన్న నాగ్

సాధారణంగా కింగ్ నాగార్జునకు రీమేక్స్ పై పెద్దగా ఆసక్తి లేదు. ఎక్కువగా స్ట్రైట్ సినిమాలే చేస్తూ వచ్చాడు నాగార్జున. తాజా సమాచారం ప్రకారం నాగార్జున ఓ మలయాళ రీమేక్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇప్పుడు మలయాళ సినిమాల మోజులో ఉంది. టాప్ హీరోల నుండి యువ హీరోల వరకూ చాలా మంది మలయాళ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు. చిరంజీవి లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ భీమ్లా నాయక్ చేస్తున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ కూడా త్వరలోనే లాంచ్ అవుతుంది. దీంతో పాటు మరిన్ని మలయాళ చిత్రాల రీమేక్స్ చిత్రీకరణ దశలో ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం నాగార్జున మలయాళంలో విడుదలైన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ కు చాలా ఇంప్రెస్ అయ్యాడట. ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. నాగార్జున నిర్మాతగా త్వరలోనే ఈ చిత్ర రీమేక్ కు సంబంధించి ప్రకటన రాబోతోందని తెలుస్తోంది.

- Advertisement -

జియో బేబీ డైరెక్ట్ చేసిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ లో పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో భర్త ఇంటికి వచ్చిన భార్య పడే కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. దీనికి ఓటిటి ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All