Homeఎక్స్ క్లూసివ్ఇంటర్నేషనల్ ఫిల్మ్ లో బోల్డ్ రోల్ లో సామ్

ఇంటర్నేషనల్ ఫిల్మ్ లో బోల్డ్ రోల్ లో సామ్

ఇంటర్నేషనల్ ఫిల్మ్ లో బోల్డ్ రోల్ లో సామ్
ఇంటర్నేషనల్ ఫిల్మ్ లో బోల్డ్ రోల్ లో సామ్

సమంత తన కెరీర్ లో గేర్లు పూర్తిగా మార్చేసింది. చాలా దూకుడుగా సినిమాలు చేస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే ప్యాన్ ఇండియన్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన సమంత రీసెంట్ గా నయనతార ప్రధాన పాత్రలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ్ చిత్రం కాతు వాక్కుల రెండు కాదల్ చిత్రాన్ని కూడా పూర్తి చేసింది. మరో రెండు తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రాలను కూడా చేస్తోంది సమంత. అలాగే రీసెంట్ గా తన కెరీర్ లోనే తొలిసారి ఐటెం సాంగ్ కు పచ్చ జెండా ఊపింది.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న పుష్ప ది రైజ్ లో సామ్ స్పెషల్ నెంబర్ చేస్తోంది. ఇక ఈరోజు సమంత తన కెరీర్ లో అతిపెద్ద గుడ్ న్యూస్ ను అందరితో షేర్ చేసుకుంది. సామ్ ఒక అంతర్జాతీయ చిత్రం చేయబోతోంది. ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా రూపొందుతోన్న చిత్రంలో సామ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అను అనే పాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోల్ చాలా బోల్డ్ గా ఉంటుందిట. బైసెక్సువల్ గా కనిపిస్తుందిట సామ్. అంటే లెస్బియన్ సీన్లు కూడా ఉంటాయని అంటున్నారు.

- Advertisement -

BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: 

పుష్ప: సమంత సాంగ్ షూటింగ్ ఎప్పటినుండి అంటే?

పుష్ప: సమంత రెమ్యునరేషన్ వింటే మతి పోవాల్సిందే

పుష్పకు డేట్స్ ఇచ్చిన సమంత

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All