Homeన్యూస్పుష్ప: సమంత సాంగ్ షూటింగ్ ఎప్పటినుండి అంటే?

పుష్ప: సమంత సాంగ్ షూటింగ్ ఎప్పటినుండి అంటే?

పుష్ప: సమంత సాంగ్ షూటింగ్ ఎప్పటినుండి అంటే?
పుష్ప: సమంత సాంగ్ షూటింగ్ ఎప్పటినుండి అంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ప్యాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు పాటలను విడుదల చేసారు. తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా ఈ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సుకుమార్ – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ మరోసారి సూపర్ హిట్ కొట్టారు. ఇక వీరి కాంబినేషన్ లో ఐటమ్ సాంగ్ కు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

సుక్కూ – దేవి కలిసి కొన్ని సెన్సేషనల్ ఐటమ్ సాంగ్స్ ను అందించారు. పుష్పలో కూడా అలాంటి సాంగ్ ఒక కంపోజ్ చేసాడు దేవి. సమంత ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో ఆడి పాడనున్నట్లు ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు ఈ సాంగ్ ఎప్పటినుండి మొదలవుతుంది అన్న సమాచారం వచ్చింది.

- Advertisement -

నవంబర్ 28 నుండి ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తవుతుంది. ఈ సాంగ్ తో పాటు కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ కలిపి డిసెంబర్ మొదటి వారానికి షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇప్పటికే ఐటమ్ సాంగ్ కు సంబంధించి సెట్ వర్క్ జరుగుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

ఏ బిడ్డా ఇది నా (రికార్డుల)అడ్డా.. ‘పుష్ప’ రాజ్ పాట నాటు.. వేట ఊర నాటు..!

ఏ బిడ్డ ఇది నా అడ్డా: ది రైజ్ ఆఫ్ పుష్ప మాస్

పుష్ప తమిళ్ రైట్స్ ను చేజిక్కించుకున్న లైకా!!

పుష్ప: సమంత రెమ్యునరేషన్ వింటే మతి పోవాల్సిందే

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All