HomeVideosపుష్ప సామి సామి లిరికల్: మాస్ బీట్స్ తో రష్మిక రచ్చ

పుష్ప సామి సామి లిరికల్: మాస్ బీట్స్ తో రష్మిక రచ్చ

పుష్ప సామి సామి లిరికల్: మాస్ బీట్స్ తో రష్మిక రచ్చ
పుష్ప సామి సామి లిరికల్: మాస్ బీట్స్ తో రష్మిక రచ్చ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం పుష్ప. ఈ ప్రాజెక్ట్ మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. ఇందుకు తగ్గట్లుగానే ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో చేస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు విడుదలై సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మూడో సాంగ్ సామి సామి వంతు వచ్చింది. రెండు రోజుల క్రితం విడుదలైన ప్రోమోతోనే ఈ సాంగ్ అందరికీ చేరువైంది. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ విడుదలైంది.

మాస్ బీట్స్ తో దేవి శ్రీ ప్రసాద్ ఆకట్టుకునే ట్యూన్ నే ఇచ్చాడు. చంద్రబోస్ సాహిత్యం కూడా ఆకర్షించే విధంగానే ఉంది. అయితే సామి సామి సాంగ్ వినగానే ఎక్కేసే ఇన్స్టంట్ నెంబర్ కాదు కానీ వినగా వినగా అడిక్షన్ లా మారే అవకాశం ఉంది. మొత్తానికి పుష్ప టీమ్ ఈ సాంగ్ తో పాజిటివ్ పాయింట్స్ స్కోర్ చేసారు.

- Advertisement -

చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. పుష్పను మొత్తం ఐదు భాషల్లో విడుదల చేస్తోన్న విషయం తెల్సిందే. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పుష్ప ది రైజ్ విడుదల కానుంది. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All