Homeటాప్ స్టోరీస్దుల్కర్ సల్మాన్ సినిమాలో రష్మిక మందన్న..!

దుల్కర్ సల్మాన్ సినిమాలో రష్మిక మందన్న..!

Rashmika Mandanna in Dulquer Salman Hanu Raghavapudi Movie

మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ అక్కడ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కేవలం మళయాళంలోనే కాదు సౌత్ సినీ పరిశ్రమలో దుల్కర్ తన సత్తా చాటుతున్నాడు. తెలుగులో దుల్కర్ సల్మాన్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. నాగ్ అశ్విన్ తీసిన మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ అతన్ని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది. ఇదే క్రమంలో దుల్కర్ సల్మాన్ తో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు స్వప్న సినిమాస్ వారు.

- Advertisement -

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపుడి డైరక్షన్ లో పాన్ ఇండియా సినిమాగా ఇది వస్తుంది. ఈ సినిమాలో ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఆ అవకాశాన్ని కన్నడ భామ రష్మిక మందన్న చేజిక్కించుకుందని తెలుస్తుంది. తెలుగులో స్టార్ డం తెచ్చుకున్న రష్మిక ఆల్రెడీ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది.

ఇక లేటెస్ట్ గా దుల్కర్ సల్మాన్ సినిమాలో కూడా అమ్మడికి లక్కీ ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో రష్మికది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర అని తెలుస్తుంది. అయినా సరే సినిమాకు ఆ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి రష్మిక మందన్న దుల్కర్ సల్మాన్ కాంబో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనుందని చెప్పొచ్చు.

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All