Homeటాప్ స్టోరీస్పుష్ప రిలీజ్ రూమర్స్ కు చెక్ పెట్టిన అల్లు అర్జున్

పుష్ప రిలీజ్ రూమర్స్ కు చెక్ పెట్టిన అల్లు అర్జున్

పుష్ప రిలీజ్ రూమర్స్ కు చెక్ పెట్టిన అల్లు అర్జున్
పుష్ప రిలీజ్ రూమర్స్ కు చెక్ పెట్టిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫస్ట్ పార్ట్, పుష్ప ది రైజ్ విడుదల తేదీపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ప్రతీ ప్రమోషనల్ కాంపైన్ లో కూడా పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న విడుదలవుతుందని చెబుతూ వస్తున్నారు. అయితే రూమర్స్ మాత్రం ఆగట్లేదు. పుష్ప నిర్మాతలు అలా చెబుతున్నా కానీ డిసెంబర్ 17కి చిత్రం విడుదల ఉండకపోవచ్చని, కచ్చితంగా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీనికి మరోసారి చెక్ పెట్టాడు బన్నీ.

నిన్న రాత్రి జరిగిన వరుడు కావలెను ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు అల్లు అర్జున్. ఈ నెల 29న విడుదలవుతోన్న ఈ సినిమా పట్ల తనకు పాజిటివ్ ఫీలింగ్ ఉందని, కచ్చితంగా చిత్రం హిట్ అవుతుందని తెలిపాడు. అలాగే దేశవ్యాప్తంగా చాలా చిత్రాలు విడుదలవుతున్నాయని, వరుడు కావలెనుతో విడుదలవుతోన్న రొమాంటిక్ కూడా బాగా ఆడాలని, అలాగే మిగిలిన భాషల్లో అన్నాత్తే, భజరంగి 2, సూర్యవంశీ కూడా విడుదలవుతున్నాయి. అన్ని చిత్రాలు బాగా ఆడాలి. మా సినిమా పుష్ప కూడా డిసెంబర్ 17న వస్తోంది. అని తన స్పీచ్ లో పేర్కొన్నాడు.

- Advertisement -

స్వయంగా అల్లు అర్జున్ చెప్పడంతో ఇక పుష్ప రిలీజ్ రూమర్స్ కు చెక్ పెట్టొచ్చు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న పుష్పలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All