Homeటాప్ స్టోరీస్ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్

 

సాహో చిత్రం నుండి ముగ్గురు సంగీత దర్శకులు తప్పుకోవడం సంచలనం అయ్యింది . ఆగస్టులో రిలీజ్ అని డేట్ కూడా ప్రకటించుకున్నాక సంగీతం నుండి తప్పుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు . సంగీత దర్శకులు తప్పుకోవడంతో సాహో ఆగస్టులో రిలీజ్ అవుతుందా ? అని నిరాశలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు ఆ చిత్ర బృందం . సాహో టీజర్ జూన్ 5 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు . దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి .

- Advertisement -

నిరాశలో ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పడంతో పరవశించి పోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ . అంతేకాదు ఆగస్టు 15 న సాహో రిలీజ్ అవ్వడం ఖాయమని అంటున్నాడు దర్శకుడు సుజిత్ . ఇప్పటికే సాహో చిత్రం పై భారీ అంచనాలున్నాయి , ఇక టీజర్ తో ఆ అంచనాలు మరింతగా పెరగడం ఖాయం . ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటించగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All