HomeVideosఆర్ ఆర్ ఆర్: విజువల్ వండర్ ను అందిస్తున్నారా!!

ఆర్ ఆర్ ఆర్: విజువల్ వండర్ ను అందిస్తున్నారా!!

ఆర్ ఆర్ ఆర్: విజువల్ వండర్ ను అందిస్తున్నారా!!
ఆర్ ఆర్ ఆర్: విజువల్ వండర్ ను అందిస్తున్నారా!!

ఎస్ ఎస్ రాజమౌళి టేకింగ్ పై ఎవ్వరికీ కూడా అనుమానాలు లేవు. బాహుబలితోనే రాజమౌళి తన స్థాయిని ఆకాశాన్ని తాకించాడు. తెలుగు సినిమాను దేశవ్యాప్తంగా గర్వపడేలా చేసాడు. మరి బాహుబలి తర్వాత చేస్తోన్న సినిమాలో బాహుబలిని మించి చూపించడానికి ఏముంటుంది? ప్రతీసారి తన అంచనాలను తనే బద్దలుకొట్టుకునేలా చేయడం అంటే మాములు విషయం కాదు. సాధారణంగా మరే దర్శకుడైనా కూడా తడబడతాడేమో కానీ అక్కడ ఉన్నది రాజమౌళి.

సినిమాను ఏళ్లకు ఏళ్ళు చెక్కుతూ ప్రేక్షకులకు ఒకింత విసుగు తెప్పించే రాజమౌళి తన సినిమాతో దాన్ని మర్చిపోయేలా చేయడమే కాకుండా ఏళ్ళు గడిచినా దాని గురించి గర్వంగా చెప్పుకునేలా చేస్తాడు. బాహుబలి తర్వాత ఆర్ ఆర్ ఆర్ పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేసిన ఆర్ ఆర్ ఆర్ టీజర్ ఇప్పుడు విడుదలైంది.

- Advertisement -

డైలాగ్స్ ఏం లేకుండా కేవలం విజువల్స్ తో ఈ టీజర్ ను నింపారు. అయితే ఆ విజువల్స్ చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. అంత గ్రాండ్ గా ఉన్నాయి. మరోసారి రాజమౌళి ఎమోషన్స్ తో ఆడుకున్నాడేమో అనిపిస్తోంది టీజర్ చూస్తుంటే. ఇక ఎంఎం కీరవాణి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ కు మరో లెవెల్ కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఆర్ ఆర్ ఆర్ టీజర్ తో అంచనాలను రెట్టింపు చేసుకుంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All