Homeన్యూస్నెట్ ఫ్లిక్స్ బాహుబలి సిరీస్... క్లారిటీ ఇచ్చిన దేవా కట్టా

నెట్ ఫ్లిక్స్ బాహుబలి సిరీస్… క్లారిటీ ఇచ్చిన దేవా కట్టా

నెట్ ఫ్లిక్స్ బాహుబలి సిరీస్... క్లారిటీ ఇచ్చిన దేవా కట్టా
నెట్ ఫ్లిక్స్ బాహుబలి సిరీస్… క్లారిటీ ఇచ్చిన దేవా కట్టా

దేశం గర్వించదగ్గ చిత్రం అంటే బాహుబలి అని అందరూ ఏ మాత్రం సందేహం లేకుండా చెబుతారు. అలాంటి బాహుబలిలో ముఖ్య పాత్ర అయిన శివగామి చుట్టూ అల్లిన కథతో ఆనంద్ నీలకంఠన్ అనే రచయిత, ది రైజ్ ఆఫ్ శివగామి అనే నవల రచించాడు. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ నాలుగేళ్ల క్రితమే బాహుబలి సిరీస్ ను ప్లాన్ చేసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహాలో ఒక భారీ పోరాటాలు, యుద్ధాలు వంటి హంగులతో అత్యంత భారీ కాన్వాస్ మీద ఒక కథ చెప్పాలని నిర్ణయించుకుంది.

దీనికోసం దేవా కట్టా, ప్రవీణ్ సత్తారులను దర్శకులుగా ఎంపిక చేసుకుంది కూడా. కొన్నేళ్ల పాటు దీనిపై వర్క్ జరిగింది కూడా. షూటింగ్ కూడా మొదలైన ఈ సిరీస్ నుండి ఇద్దరు దర్శకులూ వెనక్కి వచ్చేసారు. ఏం జరిగింది? వాళ్ళే వద్దని అన్నారా? వీళ్ళే వచ్చేసారా?

- Advertisement -

ఇటీవలే రిపబ్లిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వూస్ ఇచ్చిన దేవా కట్టా నెట్ ఫ్లిక్స్ బాహుబలిపై క్లారిటీ ఇచ్చాడు. “గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది పదేళ్ల పాటు రాసిన కథ, స్క్రీన్ ప్లే కు కూడా అంతే సమయం పట్టింది. ఒక సిరీస్ రాసుకుని దాన్ని తెరకెక్కించేలాంటి ప్రయత్నం కాదు ఇది. మన లైఫ్ టైమ్ దీనిపై పెట్టాలి. జీవితమంతా ఈ సిరీస్ కోసం ధారపోయలేం అన్న క్లారిటీ వచ్చాక మేము వెనక్కి వచ్చేసాం. రాసినదంతా వాళ్ళకే ఇచ్చేశాం” అని క్లారిటీ ఇచ్చాడు దేవా కట్టా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All