Homeటాప్ స్టోరీస్సైరా కు ఎడిటర్ గా ఎస్ ఎస్ రాజమౌళి ?

సైరా కు ఎడిటర్ గా ఎస్ ఎస్ రాజమౌళి ?

సైరా కు ఎడిటర్ గా ఎస్ ఎస్ రాజమౌళి
సైరా కు ఎడిటర్ గా ఎస్ ఎస్ రాజమౌళి

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం సై రా నరసింహ రెడ్డి ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని అక్టోబర్ 2 న విడుదల కావడానికి సిద్ధం గా ఉన్న సంగతి మన అందరికి తేలిసిందే..

సురేందర్ రెడ్డి దర్శకత్వం లో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లోనూ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..

- Advertisement -

ఈ చిత్రం ఫైనల్ ఔట్పుట్ ని దర్శక ధీరుడు రాజమౌళి పర్యవేక్షణలో ఎడిటింగ్ చేయబోతున్నట్టు సమాచారం..ప్రస్తుతం రామ్ చరణ్ -ఎన్టీఆర్ తో రాజమౌళి #RRR చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి మన అందరికి తేలిసిందే.. షూటింగ్ విరామం సమయం లో రామ్ చరణ్ సై రా నరసింహ రెడ్డి తుది ఔట్పుట్ ని చూసి తగిన మార్పులు చేయవల్సిందిగా కోరారు అట..రామ్ చరణ్ కోరిన కోరికకు రాజమౌళి కూడా పచ్చ జెండా ఊపాడు అట…

ఇప్పటికే సైరా నరసింహ రెడ్డి చిత్రం అత్యత్బుతంగా వచ్చినట్టు ఇండస్ట్రీ లో టాక్..ముఖ్యంగా ఈ చిత్రం సెకండ్ హాఫ్ అభిమానులను ఉర్రూతలూ ఊగించే విధంగా ఉండబోతుంది అట..ఇంత అద్భుతంగా వచ్చిన చిత్రానికి రాజమౌళి తుది మెరుగులు దిద్దితే బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ ప్రభంజనం ఎవ్వరు ఊహించలేనిది అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.. మరి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమో కాదో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడక తప్పదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All