Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ చరణ్ ల సినిమా ఓపెనింగ్ డే ఎప్పుడో తెలుసా

ఎన్టీఆర్ చరణ్ ల సినిమా ఓపెనింగ్ డే ఎప్పుడో తెలుసా

RRR gets opening dateయావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న సినిమా “ఆర్ ఆర్ ఆర్ ” . ఎన్టీఆర్ ,చరణ్ లు హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ప్రారంభం ఎప్పుడో తెలుసా…… నవంబర్ 11 న . అవును అట్టహాసంగా దర్శక ధీరుడు రాజమౌళి అధికారికంగా ప్రారంభోత్సవ డేట్ ని ప్రకటించాడు. నవంబర్ 11 న ఉదయం 11 గంటలకు ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం ప్రారంభం కానుంది. బాహుబలి సిరీస్ ల తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి కి తోడు ఎన్టీఆర్ , చరణ్ ల లాంటి మాస్ హీరోలు తోడయ్యాడు దాంతో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ మూడు సినిమాలు చేయగా ఆ మూడు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. ఇక చరణ్ ఒక్క మగధీర మాత్రమే చేసాడు. ఆ సినిమాతో ఇండస్ట్రీ దుమ్ము దులిపాడు.

కట్ చేస్తే ఇప్పుడు ఆ ఇద్దరూ జక్కన్న తో కలిసి చేస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ప్రస్తుతానికి ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా పెట్టారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ , చరణ్ ల అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయంలో ఓపెనింగ్ డేట్ ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేయడం ఖాయం.

- Advertisement -

English Title: RRR gets opening date

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All