Friday, December 9, 2022
Homeటాప్ స్టోరీస్భరత్ అనే నేను 100 రోజుల వేడుక

భరత్ అనే నేను 100 రోజుల వేడుక

bharath ane nenu towards 100 daysమహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా ఈనెల 28న 100 రోజులను పూర్తిచేసుకోబోతోంది దాంతో అభిమానుల సంతోషానికి అంతేలేకుండా పోతోంది . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించాడు . మహేష్ బాబు ముఖ్యమంత్రి గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుదల అయ్యింది . వేసవిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్లాప్ లలో ఉన్న మహేష్ కు పెద్ద ఊరట నిచ్చింది ఈ భరత్ అనే నేను .

- Advertisement -

ఈ చిత్రం ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ , మలయాళంలో కూడా విడుదల అయ్యింది . ఏప్రిల్ 20 న ఈ చిత్రం విడుదల కాగా జులై 28 నాటికీ వంద రోజులను పూర్తి చేసుకుంటోంది దాంతో వంద రోజుల పండగ ని భారీ ఎత్తున నిర్వహించడానికి అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు . మహేష్ వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్న సమయంలో భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ రావడంతో సంతోషంగా ఉన్నాడు . కొరటాల శివ – మహేష్ ల కాంబినేషన్ లో శ్రీమంతుడు , భరత్ అనే నేను రెండు చిత్రాలు రాగా రెండు కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి . ఇక మహేష్ తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే , ఆ సినిమాని వచ్చే ఏడాది వేసవిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: bharath ane nenu towards 100 days

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts