Homeటాప్ స్టోరీస్రేపటి నుండి అసలు పరీక్ష ఆ మూడు చిత్రాలకు

రేపటి నుండి అసలు పరీక్ష ఆ మూడు చిత్రాలకు

Real test for ntr , vishal and ram from tomorrowదసరా సెలవులు కావడంతో అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చాయి , అక్టోబర్ 11 న విడుదలైన అరవింద సమేత బాగానే లాభపడింది దసరా మూలంగా . ఇక అక్టోబర్ 18 న రామ్ నటించిన హలో గురూ ప్రేమకోసమే , విశాల్ నటించిన పందెం కోడి 2 చిత్రాలకు కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి . ఈరోజు ఆదివారం కావడంతో ఈరోజు కూడా ఎలాగూ మంచి వసూళ్లు వస్తాయి అయితే ఈ మూడు చిత్రాలకు రేపటి నుండి అసలు పరీక్ష మొదలు కానుంది . ఎందుకంటే ఈరోజుతో దసరా సెలవులు మొత్తం పూర్తయ్యాయి దాంతో రేపటి నుండి పాటశాలలు , కళాశాలలు , ఆఫీసులు యధావిధిగా పునః ప్రారంభం అవుతాయి కాబట్టి అసలు పరీక్ష రేపటి నుండే .

ఎన్టీఆర్ అరవింద సమేత దాదాపుగా రికవరీ చేసింది కొంత మాత్రమే రాబట్టాలి , అయితే పందెం కోడి 2 చిత్రానికి బిసి కేంద్రాల్లో వచ్చే కొంత వసూళ్లు తప్ప ఏ సెంటర్ లలో అస్సలు బాగోలేదు . దసరా సెలవుల్లోనే ఇలా ఉంటే రేపటి నుండి అంటే థియేటర్ ల నుండి తీసెయ్యడం తప్ప మరో మార్గం లేదు . ఇక రామ్ నటించిన హలో గురూ ప్రేమకోసమే చిత్రానికి కాస్త వసూళ్లు ఫరవాలేదు . ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన చిత్రం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫరవాలేదనే వసూళ్లు వస్తున్నాయి . అయితే రేపటి నుండి ఈ చిత్రానికి కూడా అసలు పోటీ ఏర్పడనుంది . రేపటి నుండి అన్ని సినిమాలకు వసూళ్లు తగ్గిపోనున్నాయి .

- Advertisement -

English Title: Real test for ntr vishal and ram from tomorrow

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All