Homeటాప్ స్టోరీస్మాస్ ప్రేక్షకులను మెప్పించనున్న పందెం కోడి 2

మాస్ ప్రేక్షకులను మెప్పించనున్న పందెం కోడి 2

possitive talk to vishal' s pandem kodi 2విశాల్ నటించిన పందెం కోడి 2 చిత్రం ఈరోజు విడుదల అయ్యింది . అయితే పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన పందెం కోడి 2 మాస్ ప్రేక్షకులను మెప్పించేలా రూపొందింది . అయితే ఈ సినిమా ఏ సెంటర్లలో మాత్రం ఘోర పరాజయం పొందడం ఖాయం . ఏ సెంటర్ ప్రేక్షకులను అలరించే అంశాలు ఏవి ఈ సినిమాలో లేవు దాంతో ముఖ్య నగరాలలో మాత్రం పందెం కోడి 2 కి దేబ్బపడనుంది , ఇక బిసి కేంద్రాలలో మాత్రం పందెం కోడి 2 బాగానే ఆడొచ్చు . పదమూడేళ్ళ క్రితం వచ్చిన పందెం కోడి చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రానికి ఇన్నాళ్ళ తర్వాత సీక్వెల్ గా వచ్చింది ఈ పందెం కోడి 2 .

తమిళ నేటివిటి ఎక్కువగా ఈ చిత్రానికి తమిళనాట భారీ ఓపెనింగ్స్ దక్కాయి , అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది అయితే తెలుగులో మాత్రం యావరేజ్ చిత్రంగానే నిలిచే చాన్స్ ఉంది . కేవలం బిసి కేంద్రాల్లో మంచి వసూళ్లు రాబట్టవచ్చు . లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరలక్ష్మి పవర్ ఫుల్ పాత్రలో నటించింది . విశాల్ కు జోడీగా కీర్తి సురేష్ నటించింది . మొత్తానికి దసరా బరిలో నిలిచిన ఈ పందెం కోడి 2 అనుకున్న స్థాయిలో అయితే విజయం సాధించడం కష్టమే !

- Advertisement -

English Title: possitive talk to vishal’ s pandem kodi 2

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All