Homeటాప్ స్టోరీస్అరవింద సమేత ఓవర్ సీస్ లో ఫ్లాప్ ?

అరవింద సమేత ఓవర్ సీస్ లో ఫ్లాప్ ?

Aravinda sametha towards flop in overseas ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఓవర్ సీస్ లో ఫ్లాప్ దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది . రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లు సాధిస్తున్నప్పటికీ ఓవర్ సీస్ లో మాత్రం ఓపెనింగ్స్ తర్వాత ఆ స్థాయిలో వసూళ్ళ ని రాబట్టడం లేదు . ఇప్పటి వరకు రెండు మిలియన్ డాలర్లను మాత్రమే వసూల్ చేసింది అరవింద సమేత . అక్కడ పెట్టిన పెట్టుబడి రావాలంటే రెండున్నర మిలియన్ డాలర్లు వసూల్ చేయగలగాలి అప్పుడే పెట్టిన పెట్టుబడి వస్తుంది . పరిస్థితి చూస్తుంటే అతి కష్టం మీద పెట్టిన పెట్టుబడి వచ్చేలా ఉంది . రెండున్నర మిలియన్ డాలర్లు అరవింద సమేత వసూల్ చేస్తే గొప్పే అంటున్నారు .

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడమే పెద్ద మైనస్ అయ్యింది . త్రివిక్రమ్ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ఎక్కడా లేకపోవడంతో ఓవర్ సీస్ లో అది మైనస్ గా మారింది . ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ లేరు దానికి తోడూ సినిమా పట్ల ఓవర్ సీస్ లో పాజిటివ్ గా చెప్పేవాళ్ళు లేకపోవడంతో కూడా వసూళ్లు చాలా వరకు తగ్గాయి . దాంతో ఈ సినిమాని ఓవర్ సీస్ లో కొనుకున్న వాళ్ళకు లాభాలు వచ్చేలా కనిపించడం లేదు . అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే పెట్టిన పెట్టుబడి అతికష్టం మీద వచ్చేలా ఉంది అంతే !

- Advertisement -

English Title: Aravinda sametha towards flop in overseas

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All