Homeటాప్ స్టోరీస్హలో గురూ ప్రేమకోసమే రివ్యూ

హలో గురూ ప్రేమకోసమే రివ్యూ

hello guru prema kosame movie review
హలో గురూ ప్రేమకోసమే రివ్యూ

హలో గురూ ప్రేమకోసమే రివ్యూ :
నటీనటులు : రామ్ , అనుపమా పరమేశ్వరన్ , ప్రకాష్ రాజ్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత : దిల్ రాజు
దర్శకత్వం : నక్కిన త్రినాధరావు
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 18 అక్టోబర్ 2018

రామ్అనుపమా పరమేశ్వరన్ జంటగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం ” హలో గురూ ప్రేమకోసమే ”. విడుదలకు ముందు అంతగా బజ్ లేని ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్ళాల్సిందే .

- Advertisement -

కథ ;

కాకినాడ లో ఉండే సంజు ( రామ్ ) అమ్మ – నాన్న ల కోసం జాబ్ చేయడానికి హైదరాబాద్ బయలుదేరుతాడు . అయితే ట్రైన్ లో అను (అనుపమా పరమేశ్వరన్ ) ని ఆటపట్టిస్తాడు సంజు . కట్ చేస్తే హైదరాబాద్ వెళ్ళిన సంజు విశ్వనాద్ (ప్రకాష్ రాజ్ ) ఇంట్లో దిగుతాడు , ఆ విశ్వనాద్ కూతురే ఈ అను అని తెలుసుకొని షాక్ అవుతాడు . సాఫ్ట్ వేర్ జాబ్ చేసే సంజు రీతూ ( ప్రణీత ) ని ఇష్టపడతాడు కానీ నిజంగా తను ప్రేమిస్తోంది అను ని అని తెలుసుకొని తన ప్రేమని వ్యక్తం చేయాలనుకుంటాడు . కానీ అదే సమయంలో అను కి మరో సంబంధం చూస్తాడు . సంజు తన ప్రేమని అను కి చెప్పాడా ? అను సంజు ప్రేమని అంగీకరించిందా ? విశ్వనాద్ నిర్ణయం ఏంటి ? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
రామ్
ఎంటర్ టైన్ మెంట్
అనుపమా పరమేశ్వరన్

డ్రా బ్యాక్స్ :

రొటీన్ స్టొరీ

 

నటీనటులు :

ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో మరోసారి అలరించాడు రామ్ . తన క్యారెక్టర్ లో లుక్స్ పరంగా జాగ్రత్తలు తీసుకోలేదు కానీ యాక్టింగ్ పరంగా మాత్రం కామెడి అదరగొట్టాడు . లవ్ సీన్స్ లో , యాక్షన్ సీన్స్ లో కొత్తగా చెప్పెదేముంది బాగానే రాణించాడు రామ్ . ఇక ప్రకాష్ రాజ్ – రామ్ , అనుపమా పరమేశ్వరన్ – రామ్ ల మద్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి . అనుపమా పరమేశ్వరన్ కు మంచి పాత్ర లభించింది దాంతో తన సత్తా చూపించింది . ప్రణీత పాత్ర అథితి పాత్రే అయినప్పటికీ ఆ భామ కూడా సత్తా చాటింది . ఇక ప్రకాష్ రాజ్ కు ఇలాంటి పాత్రలు కొట్టినపిండి దాంతో మరోసారి అలవోకగా చేసాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

సాంకేతిక వర్గం లో ముందుగా చెప్పాల్సింది నక్కిన త్రినాధరావు గురించి . ఇలాంటి చిత్రాలు ఇంతకుముందు నక్కిన త్రినాధరావే చేసాడు అయినప్పటికీ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా మామా – అల్లుళ్ళ మద్య మంచి కామెడి వర్కౌట్ అయ్యేలా చూసుకున్నాడు . కామెడి తో పాటుగా సెంటిమెంట్ ని కూడా సక్సెస్ ఫుల్ గా బ్యాలెన్స్ చేసి మెప్పించాడు . కొత్తదనం లేకపోయినప్పటికీ సగటు ప్రేక్షకుడు కోరుకునే వినోదాన్ని అందించాడు నక్కిన . దిల్ రాజు ఈ సినిమాని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించాడు . విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటల కంటే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది .

ఓవరాల్ గా :

కొత్తదనం లేకపోయినప్పటికీ సగటు ప్రేక్షకుడు కోరుకునే వినోదాన్ని పుష్కలంగా అందించిన చిత్రం హలో గురూ ప్రేమకోసమే

English Title: hello guru prema kosame movie review

                                     Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All