
మాస్ మహారాజా రవితేజ క్రాక్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఉత్సాహంతో ఫుల్ జోష్ లో చిత్రాలను లైన్లో పెట్టాడు. క్రాక్ తర్వాత ఖిలాడీ చిత్రాన్ని పూర్తి చేసిన రవితేజ ఇప్పుడు శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో రామారావు ఆన్ డ్యూటీ చేసాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయింది. దీని తర్వాత రవితేజ మరో సినిమాను కూడా ఇటీవలే స్టార్ట్ చేసాడు.
నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ చిత్రాన్ని చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. దసరా సందర్భంగా ఈ చిత్ర టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసాడు. ఈ చిత్రానికి ధమాకా అనే ఎంటర్టైనింగ్ టైటిల్ ను ఖరారు చేసారు. రవితేజ ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.
ప్రస్తుతం ధమాకా షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధమాకా షూటింగ్ ను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని భావిస్తున్నాడు రవితేజ. ఖిలాడీ విడుదలకు సిద్ధమవగా, రామారావు ఆన్ డ్యూటీ కూడా ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ రెండు సినిమాల తర్వాతే ధమాకా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Here’s the first look! #Dhamaka
Wishing you and your family a happy Dussehra? pic.twitter.com/oU0myUJqb8
— Ravi Teja (@RaviTeja_offl) October 15, 2021