Homeటాప్ స్టోరీస్త్రినాథరావు చిత్రాన్ని ఓకే చేసిన రవితేజ

త్రినాథరావు చిత్రాన్ని ఓకే చేసిన రవితేజ

త్రినాథరావు చిత్రాన్ని ఓకే చేసిన రవితేజ
త్రినాథరావు చిత్రాన్ని ఓకే చేసిన రవితేజ

మాస్ మహారాజా రవితేజ మళ్ళీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయిపోయాడు. ఖిలాడీ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో షార్ట్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక రేపటి నుండి రవితేజ మరో ప్రాజెక్ట్ ను మొదలుపెడుతున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ సినిమాను కన్ఫర్మ్ చేసిన విషయం తెల్సిందే.

లాక్ డౌన్ కు ముందు లాంచ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తోంది. అలాగే గతేడాది నుండి త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. ముందు స్క్రిప్ట్ విన్న రవితేజ కొన్ని మార్పులను సూచించాడట. ఇప్పుడు ఆ మార్పులు చేయడంతో రవితేజ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -

త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలుస్తాయి. ఇక ఈ చిత్రం కోసం రవితేజ ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All