Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్పటాస్ సినిమాని మిస్ చేసుకున్న హీరో

పటాస్ సినిమాని మిస్ చేసుకున్న హీరో

Rana is first choice for pataas నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పటాస్ లో అసలు హీరోగా నటించాల్సింది ఎవరో తెలుసా …… …… రానా దగ్గుబాటి . అవును పటాస్ అనే సినిమా కథ తీసుకొని మొదట సురేష్ బాబుని కలిసి కథ చెప్పాడట ! అయితే కథ మొత్తం విన్న సురేష్ బాబు స్వల్ప మార్పులు సూచించాడట అంతేకాదు రానా కూడా బాహుబలి సినిమాతో బిజీ గా ఉన్నాడు కాబట్టి అతడ్ని వదిలేసి నందమూరి కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్ళాడట ! ఇంకేముంది కథ నచ్చడంతో వెంటనే తన సొంత బ్యానర్ లోనే పటాస్ ని నిర్మించాడు సూపర్ హిట్ కొట్టేసాడు నందమూరి కళ్యాణ్ రామ్ .

- Advertisement -

ఎంటర్ టైన్ మెంట్ తో సాగిన పటాస్ ని మిస్ చేసుకున్నాక మాత్రం రానా తో పాటుగా సురేష్ బాబు కాస్త బాధపడ్డారట కానీ ఏం లాభం మిస్ అయిపొయింది కాకపోతే తాజాగా ఈ సంఘటన చెప్పి నిట్టూర్పు విడుస్తున్నాడు సురేష్ బాబు . రానా పలు చిత్రాలతో బిజీ గా ఉన్నాడు ఇప్పుడు ఇక నందమూరి కళ్యాణ్ రామ్ కన్నీళ్లని దిగమింగుతూ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు .

English Title: rana is first choice for pataas

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts